కథానాయకుడిగా నటించిన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకోవడం అత్యంత అరుదైన రికార్డు. అలాంటి రేర్ ఫీట్‌తో దశాబ్దం క్రితం వార్తల్లో నిలిచాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. `మగధీర` రూపంలో నెలకొల్పిన ఆ రికార్డు… ఇప్పటికీ అలానే పదిలంగా ఉండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా `చిరుత`తో కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన చరణ్… రెండో చిత్రం `మగధీర`తో సంచలన విజయం అందుకున్నాడు. ఈ ఘనవిజయంలో దర్శకధీరుడు రాజమౌళి శ్రమ, విజన్ ప్రధాన భూమిక పోషించాయి. ఇక ఇదే సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందింది. శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్, శరత్ బాబు, సునీల్, బ్రహ్మానందం, సలోని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో… మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో దర్శనమిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎం.ఎం.కీరవాణి స్వరసారథ్యంలో రూపొందిన ప్రతీ పాట ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా “పంచదార బొమ్మ”, “ధీర ధీర”, “నాకోసం నువ్వు” వంటి గీతాలతో పాటు “బంగారు కోడిపెట్ట” రీమిక్స్ కూడా విశేషాదరణ పొందాయి. గీతా ఆర్ట్స్ పతాకంపై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం… పలు పురస్కారాలను సొంతం చేసుకుంది. 2009 జూలై 31న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన ‘మగధీర’… నేటితో 10 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[youtube_video videoid=fCi_c7tZnC0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























