తెలుగునాట మహానటుడు నందమూరి తారక రామారావుది చిరస్మరణీయ ప్రస్థానం. అందుకే… యన్టీఆర్ నటించిన చిత్రాలే కాదు టైటిల్స్ కూడా టాలీవుడ్లో ఎవర్ గ్రీన్. నాటి అగ్ర కథానాయకులు ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మొదలుకుని నేటి తరం అగ్ర కథానాయకుడు ప్రభాస్ వరకు… అంటే మూడు తరాల స్టార్ హీరోలు ఆయన పాత చిత్రాల టైటిల్స్‌తో కొత్త చిత్రాల్లో సందడి చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం అగ్ర కథానాయకులే కాకుండా… పలువురు యువ కథానాయకులు కూడా యన్టీఆర్ టైటిల్స్‌తో మురిపించారు. ఇక ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నాలుగు చిత్రాలు యన్టీఆర్ టైటిల్స్‌తో రూపొందుతుండడం విశేషం. `వాల్మీకి` (వరుణ్ తేజ్), `భీష్మ` (నితిన్), `నిన్నే పెళ్ళాడతా` (అమన్ ప్రీత్ సింగ్), `డ్రైవర్ రాముడు` (షకలక శంకర్)… ఇలా యన్టీఆర్ టైటిల్స్‌తో ఇప్పుడు నాలుగు కొత్త చిత్రాలు వస్తున్నాయి. ఈ తీరు చూస్తుంటే… భావితరాల్లోనూ యన్టీఆర్ టైటిల్స్ అంటే ఇదే క్రేజ్ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దటీజ్ యన్టీఆర్!
[youtube_video videoid=e0UyXPd2cy8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























