నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ ను ఏంటి యష్ రికమెండ్ చేయడం ఏంటీ అనుకుంటున్నారా..? అసలు స్టోరీ ఏంటంటే.. కేజీఎఫ్ లాంటి భారీ యాక్షన్ సినిమాతో యష్ కన్నడ తో పాటు తెలుగు, హిందీ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. కలెక్షన్ల పరంగా కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ఇక యష్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని.. కన్నడ స్టార్ డైరక్టర్ ఒకరు యష్ ని ఓ ఇంట్రస్టింగ్ స్టోరీతో, పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న కథతో ఎప్రోచ్ అయ్యారట. కేజీఎఫ్ సినిమాను మించిన కథ అవుతుందని యష్ కి ఆ డైరెక్టర్ చెప్పాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే స్టోరీ మొత్తం విన్న యష్ ఇంత భారీ సినిమాకు నేను సరిపోనని చెప్పి ఈ స్టోరీకి ప్రభాస్ లాంటి హీరో అయితే కరెక్ట్ అని చెప్పాడట. అంతేకాదు ప్రభాస్ కు ఫోన్ చేసి మరీ డైరెక్టర్ గురించి చెప్పి ఈ కథ వినమని చెప్పాడట. దీంతో ఆ డైరెక్టర్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయట. తను ప్రభాస్ ను కలిసి కథ చెప్పడం అంటే అది జరిగే పనికాదని… యష్ చెప్పడం వల్ల తేలిగ్గా జరిగుతుందని చెబుతున్నాడట. మరి ప్రభాస్ ఎప్పుడు కథ వింటాడో..మరి ఆ కథ ప్రభాస్ కు నచ్చుతుందో.. అసలు నిజంగా ఇదంతా నిజమేనా అన్నది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[youtube_video videoid=dU7rC_KhTBc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: