సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… రేపటి నుంచి (జూలై 5) రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం… కాశ్మీర్లో తొలి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో భాగంగా మహేష్‌తో పాటు రాజేంద్రప్రసాద్ ఇతర ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అలాగే… టైటిల్ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నట్టు సమాచారం.
మహేష్, అనిల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. తారా స్థాయిలో ఉన్న ఈ అంచనాలను… ఈ ద్వయం ఏ విధంగా అందుకుంటుందో చూడాలంటే 2020 సంక్రాంతి వరకు వేచి ఉండాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=GPU0CAGGzAU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























