`రాజు గారి గది` ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా `రాజు గారి గది 3` రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలి రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన ఓంకార్… ఈ మూడో చిత్రాన్ని కూడా తెరకెక్కించనున్నాడు. `రాజు గారి గది` లో పూర్ణ, `రాజు గారి గది 2`లో సమంత ప్రధాన పాత్రల్లో నటించగా… `రాజు గారి గది 3` కోసం తమన్నాని ఎంచుకున్నాడు దర్శకుడు. దానికి తగ్గట్టే… ప్రారంభోత్సవం రోజున తమన్నాపై ముహుర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు కూడా.
అయితే, ఏమైందో తెలియదు కానీ… తమన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకి వచ్చేసినట్లు గత కొద్ది రోజులుగా రకరకాల కథనాలు వస్తున్నాయి. దీనిపై యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోగా… ఇప్పుడు తమన్నా స్థానంలో తాప్సీ నటించబోతోందని మరో వార్త హల్చల్ చేస్తోంది. మరి… `రాజు గారి గది 3`లో తాప్సీ ఎంట్రీ కథనాల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.