అఖిల్ అక్కినేని కథానాయకుడిగా `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. కాగా, ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ని గత నెల 26 నుంచి ప్రారంభించనున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి.
తాజా సమాచారం ప్రకారం… కథానాయిక ఎంపికలో జాప్యం జరగడంతో… ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. త్వరలోనే హీరోయిన్, రెగ్యులర్ షూటింగ్ డిటైల్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశముంది. గోపీసుందర్ సంగీతసారథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా… ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ సంవత్సరాంతంలో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దిశగా ప్రణాళిక జరుగుతోందని సమాచారం.
[subscribe]
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.