“శ్రీకారం ” చుట్టిన శర్వానంద్

2019 Latest Telugu Film News, Sharwanand Starts A New Movie, Sharwanand New Movie News, Sharwanand Next Project Details, Sharwanand Signs A New Project, Sharwanand Signs Another Crazy Project, Sharwanand Upcoming Films, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Sharwanand Starts A New Movie
యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడు గా నటించే కొత్త సినిమా ఆదివారం (జూన్ 30వ తేదీ )పూజ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషొర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా శ్రీకారం మూవీ రూపొందనుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్ కొట్టిన శ్రీకారం మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభమవుతుంది. మిక్కీ J మేయర్ సంగీతం అందిస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. శ్రీకారం మూవీ ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ రణరంగం మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శర్వానంద్, సమంత జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ లో శర్వానంద్ గాయపడిన విషయం తెలిసిందే. సర్జరీ తో కోలుకున్న శర్వానంద్ కు 2నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. కొన్ని రోజులలోనే శ్రీకారం మూవీ ని శర్వానంద్ ప్రారంభించడం విశేషం. ఆగస్ట్ నెలలో శ్రీకారం, 96 మూవీస్ షూటింగ్స్ లో హీరో శర్వానంద్ పాల్గొనాల్సి ఉంటుంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid= DTW2HnJxL7g]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.