కల్కీ రన్ టైమ్ లాక్

2019 Latest Telugu Movie News, Kalki Movie Run Time Locked,Actor Rajashekar Kalki Telugu Movie Runtime, kalki Movie Runtime, kalki Movie Updates, kalki Telugu Movie Latest News, Latest Telugu Film News 2018,Rajashekar Kalki Runtime, Telugu Filmnagar, Telugu Movies News, Tollywood Cinema Updates
Kalki Movie Run Time Locked

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. తాజాగా ఈసినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. 2 గంటల 22 నిమిషాల రన్ టైమ్ కలిగి ఉంది. మరి ఒక థ్రిల్లర్ మూవీకి ఇంత టైమ్ అంటే గొప్ప విషయమే. మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో రాజశేఖర్ సరసన కథానాయికలుగా ఆదా శర్మ, నందిత శ్వేత నటిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని, శివాత్మిక సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, దాశరథి శివేంద్ర ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1983లో జరిగిన మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కుతున్నఈచిత్రంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

మరి గతంలో పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ చేసిన చాలా సినిమాలు ఆయనకి విజయాలనే తెచ్చిపెట్టాయి. ఆ సెంటిమెంట్ కారణంగా ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎంతవరకూ నిలబెడుతుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=fa1pq43Ew1Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.