ఈ మధ్య హాలీవుడ్ సినిమాలకు గాత్ర దానం చేయడం కామన్ అయిపోయింది. ఇటీవల రానా ‘అవెంజెర్స్ ఎండ్ గేమ్’ సినిమాలో థానోస్ కు గాత్రదానం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అల్లావుద్దీన్ సినిమాకు వెంకీ, వరుణ్ కూడా గాత్రదానం చేశారు. జీని పాత్రకు వెంకీ డబ్బింగ్ చెప్పగా, అల్లావుద్దీన్ కి వరుణ్ గొంతు పలికారు. ఇప్పుడు మరో ఇద్దరు స్టార్ కమెడియన్స్ తమ గొంతును అరువివ్వనున్నారు. వారు ఎవరో కాదు కామెడీ బ్రహ్మ బ్రహ్మనందం, అలీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ రూపొందించిన యానిమేటెడ్ చిత్రం ‘ద లయన్ కింగ్’ గుర్తుండే ఉంటుంది కదా. ‘ది జంగిల్ బుక్’, ‘ఐరన్ మ్యాన్’ సినిమాల దర్శకుడు జాన్ ఫేవరోవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 1994లో వచ్చిన ‘లయన్ కింగ్’ ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాను 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక హాలీవుడ్ మూవీస్ ను ఇంగ్లీష్ తో పాటు ఇక్కడ తెలుగులో డబ్ చేసి కూడా రిలీజ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే.. ఈ చిత్రానికి లోకల్ భాషల్లో కూడా క్రేజ్ పెరగడానికి డబ్బింగ్ ను ఆయా భాషల్లోని పేరు ఉన్న నటీనటులతో చెప్పిస్తున్నారు.
దీనిలో భాగంగానే.. తెలుగు వెర్షన్ లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమాలో పుంబా (అడవి పంది) పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ (ముంగీస) పాత్రకు ఆలీ డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఇప్పటికే, అల్లాద్దీన్ సినిమాతో మూవీ లవర్స్ ని అలరించిన డిస్నీ సంస్థ.. ఇప్పుడు లయన్ కింగ్ రూపంలో మరోసారి అలరించబోతున్నారు.
[youtube_video videoid=mJu7BX4Vwzk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: