కన్నడలో నరేష్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా నరేష్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ మద్దినేని, కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇటీవల విడుదల అయిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఇక్కడ కూడా ఈ సినిమా ఘన విజయం అవుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈనెల 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. కాగా డాల్ఫిన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై మంజునాథ్ వి కందుకూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్ రవింద్ర నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
[youtube_video videoid=F97qoYMuskg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























