తెలుగులో హిట్ అయిన సినిమాను హిందీలో.. హిందీలో హిట్ అయిన సినిమాను తెలుగులో రీమేక్ చేయడం ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయమే. ఇప్పుడు తాజాగా మరో హిందీ సినిమా రీమేక్ అవ్వనుంది. అజయ్ దేవగణ్, రకుల్,టబు హీరోహీరోయిన్లుగా నటించిన దే దే ప్యార్ దే సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 100 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈసినిమా అక్కడ. భార్యను వదిలేసి యంగ్ లేడీ ప్రేమలో పడ్డ మిడిల్ ఏజ్ మెన్ గా అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో నటించాడు. ఇక రకుల్ కు కూడా ఈసినిమాతో బాలీవుడ్ లో హిట్ దొరికింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకీ ఈసినిమా టాలీవుడ్ లో ఎవరు రీమేక్ చేస్తున్నారబ్బా అనుకుంటున్నారా? ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. గతంలో ఆయన రీమేక్ చేసిన బాడీగార్డ్, దృశ్యం, గురు వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. తాజాగా ఈ సినిమాను కూడా తెలుగులో వెంకటేష్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు అన్న సురేష్ బాబు, ‘దే దే ప్యార్ దే” మూవీ నిర్మాతలతో చర్చించినట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=hvS33iNEz5U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























