‘జెర్సీ’ భామకి మెగా ఆఫ‌ర్‌?

Shraddha Srinath in consideration for Chiranjeevi and Koratala Siva Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shraddha Srinath Next With Chiranjeevi,Chiranjeevi and Shraddha Srinath To Team Up For Next,Shraddha Srinath to Work With Chiranjeevi,Shraddha Srinath Pair Up With Chiranjeevi Next Film,Chiranjeevi Roped in For Shraddha Srinath
Shraddha Srinath in consideration for Chiranjeevi and Koratala Siva Movie

ఈ వేస‌విలో విడుద‌లైన ఎమోష‌న‌ల్‌ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’తో టాలీవుడ్‌కు క‌థానాయిక‌గా పరిచయమైంది శ్రద్ధా శ్రీనాథ్. అంతేకాదు… తన నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే… తాజాగా శ్ర‌ద్ధ‌ ఓ మెగా ఆఫర్‌ను చేజిక్కించుకుందని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న‌ విషయం తెలిసిందే. కొరటాల శైలిలో మెసేజ్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్‌తో రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని… కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు సమాచారం. జూలై లేదా ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇద్దరు కథానాయికలకు స్థానమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ పాత్ర‌లో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార పేరు వినిపిస్తుండగా… సెకండ్ హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేసినట్టు క‌థనాలు వస్తున్నాయి. త్వ‌ర‌లోనే క‌థానాయిక‌ల ఎంపిక‌పై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి… నాని ప‌క్క‌న అల‌రించిన శ్ర‌ద్ధ‌.. మెగాస్టార్ జోడీగానూ మెప్పిస్తుందేమో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=og_4GC7Swpc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.