ఆర్ఎక్స్ 100 సినిమా ఘన విజయంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. టీఎమ్ కృష్ణ దర్శకత్వంలో తాను నటించిన హిప్పీ సినిమా ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాతో పాటు కార్తికేయ గుణ 369 అనే మరో సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి దగ్గర అసోసియేట్ గా పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. రెడ్ కలర్ షర్ట్ తో .. లుంగీ పైకెత్తి కట్టి .. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఈ పోస్టర్ లో కార్తికేయ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ ఒక్క లుక్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు.
కాగా ఈ సినిమాలో కార్తికేయకు జోడిగా.. అనఘ అనే మలయాళ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను జ్ఞాపిక ప్రొడక్షన్స్ మరియు స్ప్రింట్ మీడియా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తిరుమల రెడ్డి – అనిల్ కడియాల నిర్మాతలు. RX 100 సినిమాకు సంగీతం అందించిన చైతన్ భరద్వాజే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా కార్తికేయకు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
[youtube_video videoid=ILY3zkBenNU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























