`భ‌ర‌త్ అనే నేను`ని అధిగ‌మించిన `మ‌హ‌ర్షి`

Mahesh Babu Maharshi Movie Crosses Bharat Ane Nenu Movie Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie Creates a Record,Maharshi Movie Crosses Bharat Ane Nenu Shares,Maharshi Movie Latest Collections,Maharshi Movie Beats Bharat Ane Nenu Movie Collections
Mahesh Babu Maharshi Movie Crosses Bharat Ane Nenu Movie Collections

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ మ‌హ‌ర్షి… మే 9న విడుద‌లై తెలుగు రాష్ట్రాల్లో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా… ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ టాలీవుడ్ టాప్ 5 హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్‌లో స్థానం ద‌క్కించుకుంది. అంతేకాదు… మ‌హేశ్ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చిన భ‌ర‌త్ అనే నేను ఫుల్ ర‌న్ వ‌సూళ్ళ‌ని అధిగ‌మించింది. నిన్నటి (మే 28) వ‌ర‌కు వ‌చ్చిన వ‌సూళ్ళ‌తో మ‌హ‌ర్షి ఈ ఫీట్‌ని సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… మొద‌టి నాలుగు స్థానాల‌లో బాహుబ‌లి 2-ది కంక్లూజ‌న్‌, బాహుబ‌లి - ది బిగినింగ్‌, రంగ‌స్థ‌లం, ఖైదీ నంబ‌ర్ 150 కొన‌సాగుతుండ‌గా… ఐదు, ఆరు స్థానాల్లో మ‌హ‌ర్షి, భ‌ర‌త్ అనే నేను ఉన్నాయి. ఇక ఏడో స్థానంలో అర‌వింద స‌మేత‌.. ఎనిమిదో స్థానంలో శ్రీ‌మంతుడు.. తొమ్మిదో స్థానంలో ఎఫ్ 2.. ప‌దో స్థానంలో జ‌న‌తా గ్యారేజ్‌ ఉన్నాయి. మొత్త‌మ్మీద‌… టాలీవుడ్ టాప్ 10 గ్రాస‌ర్స్‌లో అధిక చిత్రాలు ఉన్న క‌థానాయ‌కుడిగానూ మ‌హేశ్ రికార్డు సాధించాడు. మూడు చిత్రాల‌తో మ‌హేశ్ ముందంజ‌లో ఉన్నాడు.

అంతేకాదు.. నైజాంలో షేర్ ప‌రంగా రంగ‌స్థ‌లం రికార్డుల‌ని మ‌హ‌ర్షి అధిగమించిందని… గ్రాస్ ప‌రంగా మాత్రం రంగ‌స్థ‌లం ముందుంద‌ని ట్రేడ్ టాక్‌. మ‌హ‌ర్షి స‌మ‌యానికి జీఎస్టీ త‌గ్గిన‌ కార‌ణంగానే గ్రాస్‌, షేర్‌ల ప‌రంగా ఈ తేడా చోటుచేసుకుంద‌ని వాణిజ్య వ‌ర్గాల స‌మాచారం. మొత్త‌మ్మీద‌.. డివైడ్ టాక్‌తోనే మ‌హ‌ర్షి వ‌సూళ్ళ ప‌రంగా వండ‌ర్స్ క్రియేట్ చేయ‌డం విశేషమేనంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్త‌మ్మీద‌… నైజాంలో నాన్‌-బాహుబ‌లి రికార్డు న‌మోదు చేసిన‌ మ‌హ‌ర్షి… ఫుల్ ర‌న్ కంప్లీట్ అయ్యేస‌రికి ఏ మేర‌కు ఆర్జిస్తుందో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=99HP5NvZ7iY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.