మా ఇద్దరిది ఒకే బాట అంటున్నారు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్, నేచురల్ స్టార్ నాని. అదేమిటంటే… తమని వెండితెరకు పరిచయం చేసిన దర్శకుల కోసం ఈ ఇద్దరు టాలెంటెడ్ స్టార్స్ కూడా నెగటివ్ టర్న్ తీసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇద్దరు’(1997) (తమిళంలో ‘ఇరువర్’) సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది ఐశ్వర్యా రాయ్. అనంతరం ఈ ఇద్దరి కలయికలో ‘గురు’, ‘విలన్’ (హిందీలో ‘రావణ్’) చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత ఈ ఇద్దరు ‘పొన్నియిన్ సెల్వన్’ కోసం నాలుగోసారి జట్టుకడుతున్నారు. అంతేకాదు… మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ ప్రతినాయకురాలి పాత్రలో నటించనుంది. రాజ్యాధికారం మీద మక్కువతో ఎటువంటి ద్రోహానికైనా పాల్పడే పాత్రలో ఈ అందాల తార దర్శనమివ్వనుంది.
కట్ చేస్తే… ఐష్ తరహాలోనే నాని కూడా పయనిస్తున్నాడు. ‘అష్టాచమ్మా’తో తనని కథానాయకుడిగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో… ఆ తర్వాత ‘జెంటిల్మన్’(2016)లో నటించిన నాని.. ఇప్పుడు అదే ఇంద్రగంటి రూపొందిస్తున్న ‘వి’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం. ఇందులో.. ఎమోషన్ లెస్, నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నాని కనిపించనున్నట్టు తెలుస్తోంది.
మరి… తమని వెండితెరకు పరిచయం చేసిన దర్శకుల కోసం నెగటివ్ టర్న్ తీసుకున్న ఐష్, నాని.. ఆ యా పాత్రల్లో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=RjSeTHHQO1U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























