2019… విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయితేజ్, ర‌కుల్‌కి ఎంతో స్పెష‌ల్‌

2019 – A Very Special Year For Tollywood Stars,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Who Are Lucky in 2019 Tollywood Stars,2019 Lucky Charms in Telugu Film Industry,2019 Very Special Year For Telugu Stars,The Best Actors and Actress in Tollywood 2019
2019 – A Very Special Year For Tollywood Stars

ఈ ఏడాది ద్వితీయార్ధం ముగ్గురు సినీ ప్ర‌ముఖుల‌కు ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే… ఈ సంవ‌త్స‌రం వారి త‌మ్ముళ్ళు టాలీవుడ్‌లో తొలి అడుగులు వేస్తున్నారు. అంతేకాదు… ఆయా ప్ర‌ముఖుల త‌మ్ముళ్ళ మొద‌టి చిత్రాల్లో హీరోయిన్లుగా న‌టిస్తున్నవారు, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌వారు కూడా కొత్త‌వారే కావ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘దొరసాని’. ఈ చిత్రంతోనే సీనియర్ నటుడు రాజశేఖర్ రెండో తనయ శివాత్మిక కూడా హీరోయిన్‌గా పరిచయం కానుంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ కె.వి.ఆర్.మహేంద్ర దర్శకత్వం వహించాడు. జూలై 5న ‘దొరసాని’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.

అలాగే… మెగా హీరో సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన‌’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వైష్ణవ్‌కు జంటగా కృతి శెట్టి న‌టిస్తోంది. తెలుగునాట త‌న‌కిదే తొలిచిత్రం కావ‌డం విశేషం. అలాగే సుకుమార్ వ‌ద్ద‌ అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం… ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది.

ఇక‌ స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఈ ఏడాదిలోనే టాలీవుడ్‌కి హీరోగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రంతో మోనికా శర్మ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ దాసరి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం కూడా ఈ ఏడాది చివర్లో తెరపైకి వచ్చే అవకాశం ఉంది.

ఈ ముగ్గురు ప్ర‌ముఖుల (విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సాయితేజ్‌, ర‌కుల్‌) త‌మ్ముళ్ళు… త‌మ‌దైన శైలితో తెలుగునాట క‌థానాయ‌కులుగా రాణించాల‌ని ఆశిద్దాం..

[subscribe]

[youtube_video videoid=4BRnD6to5dY ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.