మీడియా సమావేశంలో కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Meets The Press,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Aggarwal About Sita Movie,Kajal Aggarwal New Movie Sita Latest Updates,Kajal Sita Telugu Movie Details,Kajal Talks About Working With Director Teja in Sita Film
Kajal Aggarwal Meets The Press

AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సీత మూవీ మే 24వ తేదీ రిలీజ్ కానుంది. సీత మూవీ ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 19 వ తేదీ విలేఖరుల సమావేశం లో పాల్గొన్నారు. పలువురు విలేఖరుల ప్రశ్నలకు ఈ విధంగా జవాబిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీత మూవీ ఒక ఆధునిక యువతి కథని , నటనకు ప్రాధాన్యమున్న చిత్రమని, శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించాల్సిన సీత పాత్ర కోసం తన స్వేదం, రక్తం ధారపోశానని, సీత మూవీ లో భావోద్వేగాలతో పాటు, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పలు అంశాలు కూడా ఉన్నాయన్నారు. లక్ష్మీ కళ్యాణం మూవీ తో తనను తేజ టాలీవుడ్ కు పరిచయం చేశారని, నేనే రాజు నేనే మంత్రి మూవీతో విజయాన్ని అందించారని, సీత తమ కాంబినేషన్ లో మూడవ చిత్రమని, దర్శకుడు తేజ ప్రతీ మూవీ తో తనను నటిగా మరో మెట్టు ఎక్కిస్తారని అన్నారు. సాయి శ్రీనివాస్ బాగా నటించాడని, తమ ఇద్దరి కెమిస్ట్రీ పండిందని చెప్పారు. సినిమా పై తనకు ఉన్న ఇష్టం, తపన , చేస్తున్న పనిని ఆస్వాదించడం,అవకాశాలు , సమయాన్ని సద్వినియోగం చేసుకొనడం తన సుదీర్ఘ సినీ ప్రయాణ రహస్యం అని, భారతీయుడు 2 మూవీ లో నటిస్తున్నానని, శర్వానంద్, జయం రవి తో నటించిన మూవీస్ త్వరలో రిలీజ్ కానున్నాయని, పలు భాషలలో రూపొందనున్న మూవీ లో నటించనున్నానని, తన దగ్గరకు వచ్చిన కథలలో నచ్చినదానిని ఎంపిక చేసుకొంటానని కాజల్ తెలిపారు.

[subscribe]

[youtube_video videoid=4Jru8PEbVrA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.