యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్
. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామా… ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకుంది. కాగా.. ఆ మధ్య తారక్, చెర్రీ వేర్వేరు సందర్భాల్లో గాయపడిన కారణంగా చిత్రీకరణకు స్వల్ప విరామం ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు గాయం నుంచి కోలుకోవడంతో… ఈ నెల 21 నుంచి తాజా షెడ్యూల్ను ప్రారంభించనున్నట్టు సమాచారం. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఓ స్పెషల్ సెట్లో ఈ షెడ్యూల్ జరగనున్నట్టు టాక్. అంతేకాదు… ఈ షెడ్యూల్లో కథానాయిక అలియా భట్ కూడా జాయిన్ కానుందని తెలుస్తోంది.
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఆర్ ఆర్ ఆర్
కి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నాడు. డి.వి.వి.దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ… వచ్చే ఏడాది జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
[youtube_video videoid=maAiixIZotg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: