సృష్టిలో ఓంకారాన్ని మించిన అద్భుతమైన మాట “అమ్మ”. ఆ దైవాన్ని మించిన దైవం “అమ్మ”. తన ఆయువునే ఆరో ప్రాణంగా మలచి జన్మనిచ్చే మాతృమూర్తి “అమ్మ”… ఇలా చెప్పుకూంటూ పోతే… “అమ్మ” అనే మాటకు పర్యాయపదాలు ఎన్నో ఎన్నెన్నో. “అమ్మ” గురించి చెప్పాలంటే భాష చాలదు. చెప్పాలన్న ఆశ ఆగదు. కాని “అమ్మ”కు సాటి ఈ సృష్టిలోనే లేదు అన్నది మాత్రం అక్షర సత్యం. అంతటి ప్రాముఖ్యత కలిగిన “అమ్మ” పాత్ర నిజ జీవితంలోనే కాదు… సినిమాల్లోనూ రమణీయం, కమనీయం, చిరస్మరణీయం. అందుకే… వెండితెరపై “అమ్మ” సెంటిమెంట్‌తో పలు సినిమాలు రూపొందాయి. ఘనవిజయం సాధించాయి. ఇందుకు స్టార్ హీరోలు కూడా మినహాయింపు కాదు. మదర్స్ డే సందర్భంగా మూడు తరాలకు చెందిన మన అగ్ర కథానాయకులు నటించిన కొన్ని మదర్ సెంటిమెంట్ సినిమాలను “ స్టార్ మా ” పేరిట మననం చేసుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తొలి తరం అగ్ర కథానాయకుల విషయానికి వస్తే యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు… పలు మదర్ సెంటిమెంట్ చిత్రాల్లో నటించి కుటుంబ ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఇక తరువాతి తరం విషయానికి వస్తే… అడవిదొంగ, రాక్షసుడు, ముగ్గురు మొనగాళ్ళు చిత్రాలలో చిరంజీవి, భైరవద్వీపంలో బాలకృష్ణ, మనంలో నాగార్జున, అబ్బాయి గారు, ధర్మ చక్రంలో వెంకటేష్… మదర్ సెంటిమెంట్ సీన్స్‌లో మనసులు దోచుకున్నారు. ఇక ఈ జనరేషన్ హీరోల విషయానికి వస్తే.. కొమరం పులి, గబ్బర్ సింగ్ చిత్రాలలో పవన్ కళ్యాణ్.. నిజం, నానిలో మహేష్ బాబు.. ఛత్రపతి,యోగి,బాహుబలిసిరీస్‌లో ప్రభాస్..అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలో రవితేజ..చిరుతలో రామ్ చరణ్అమ్మ` చుట్టూ అల్లుకున్న కథల్లో భాగమయ్యారు.
మొత్తమ్మీద… నాటి యన్టీఆర్ నుంచి నేటి రామ్ చరణ్ వరకు మూడు జనరేషన్‌ల స్టార్ హీరోలు మదర్ సెంటిమెంట్ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకోవడమే కాదు… ఘనవిజయాలు అందుకున్న దాఖలాలు ఉన్నాయి. మున్ముందు… ఈ జాబితాలో ఇంకెన్ని సినిమాలు చేరతాయో చూడాలి.
[subscribe]
[youtube_video videoid= 2eV3R1JQ1To]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























