ఏడాది గ్యాప్‌లో తెలుగు తెర‌పై ఇద్ద‌రు క్రేజీ బాలీవుడ్ భామ‌ల సంద‌డి

Shraddha Kapoor and Alia Bhatt All Set To Mesmerize Telugu Audience,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Shraddha Kapoor and Alia Bhatt To Impress the Tollywood,Shraddha Kapoor and Alia Bhatt Got a Golden Chance in Tollywood,Shraddha Kapoor Upcoming Telugu Movie News,Alia Bhatt Next Telugu Film Updates
Shraddha Kapoor and Alia Bhatt All Set To Mesmerize Telugu Audience

టాలీవుడ్‌లో బాలీవుడ్ హీరోయిన్ల‌ సంద‌డి కొత్తేమీ కాదు. హిందీలో రాణించిన ప‌లువురు క‌థానాయిక‌లు తెలుగునాట కూడా అల‌రించారు. అయితే… వారిలో కొంద‌రు ఒక‌టి, రెండు సినిమాల‌కు ప‌రిమిత‌మ‌వ‌గా… మ‌రికొంద‌రు తెలుగు చిత్ర‌సీమ‌లో కూడా త‌మ హ‌వాను కొన‌సాగించారు. ఈ నేప‌థ్యంలో… తెలుగు చిత్ర పరిశ్ర‌మ‌లోనూ స‌త్తా చాట‌డానికి ఇద్ద‌రు యంగ్ అండ్ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీస్‌ సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ ఇద్ద‌రు మ‌రెవ‌రో కాదు… శ్ర‌ధ్ధా క‌పూర్‌, అలియా భ‌ట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ‘ఆషిఖీ 2’తో హిందీనాట క‌థానాయిక‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్ర‌ధ్ధా క‌పూర్‌… ప్ర‌స్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ట్రైలింగ్వ‌ల్ మూవీ ‘సాహో’లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. హీరోయిన్లంటే కేవ‌లం గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైపోతున్న ఈ రోజుల్లో… ‘సాహో’లో మాత్రం ప్రాధాన్య‌మున్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట శ్ర‌ధ్ధ. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగ‌స్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అలాగే… ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి రూపొందిస్తున్న మ‌ల్టీలింగ్వ‌ల్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’లో క్రేజీ బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న ఈ మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో చ‌ర‌ణ్‌కు జోడీగా క‌నిపించ‌నుంది అలియా. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జూలై 30న తెర‌పైకి రానుంది. ఇలా… ఏడాది గ్యాప్‌లో క్రేజీ మ‌ల్టీలింగ్వల్ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ ఇద్ద‌రు బాలీవుడ్ భామ‌లు… టాలీవుడ్‌లో కూడా త‌మ‌దైన ముద్ర‌ను వేస్తారేమో చూద్దాం…

[subscribe]


[youtube_video videoid=8HFxQsWRMTM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.