మెగా హీరో సినిమాలో కన్ఫామ్

Vijay Sethupathi Role Confirmed In Mega Hero Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vijay sethupathi Next Movie Confirmed With Mega Hero,Vijay sethupathi To Work With New Mega Hero,Vijay sethupathi Next Project Details,Vijay sethupathi and Mega Hero Vaishnav Tej To Team Up For Next,Vijay Sethupathi Role in Vaishnav Tej New Movie
Vijay Sethupathi Role Confirmed In Mega Hero Movie

మెగా మేనల్లుడు సాయథరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకత్వంలో.. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిస్తున్న ఈ సినిమాను ఇటీవలే మెగా కుటుంబసభ్యుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. మే నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పంజా వైష్ణ‌వ్ తేజ్ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషిస్తున్నట్టు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా తెలిపింది.

కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా మనీషా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి.

న‌టీన‌టులు: వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సాన‌
బ్యాన‌ర్స్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్ర‌ఫీ:శ‌్యామ్ ద‌త్ సైనుద్దీన్‌
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మోనిక రామ‌కృష్ణ‌

[subscribe]


[youtube_video videoid=QtGr3NQVyyk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.