డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో నవీన్ చంద్ర ప్రధాన పాతలో తెరకెక్కుతున్న సినిమా 28డిగ్రీస్ సెల్సియస్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. మరోసారి నవీన్ చంద్ర ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు (ఏప్రిల్ 27) మధ్యాహ్నం 2.30 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో నవీన్ చంద్ర సరసన షాలిని వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో ప్రియదర్శి, వైవా హర్ష, రాజా రవీంద్ర, అభయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాస్ సంస్థపై సాయి అభిషేక్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మరి నవీన్ చంద్ర ఈ సినిమాతో పాటు హీరో హీరోయిన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. గాయత్రి సురేష్, పూజ జవేరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. మరి చూద్దాం ఈ రెండు సినిమాలు నవీన్ కు మంచి సక్సెస్ అందిస్తాయేమో.
[subscribe]
[youtube_video videoid=eMfimbrr1Z4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























