బ‌న్నీ సినిమాలో ఆస‌క్తిక‌మైన విష‌యం

Allu Arjun and Trivikram Movie Latest News, Allu Arjun Choose Interesting Story For His 20th Movie, Highlights In Allu Arjun Trivikram Movie, Interesting Point In Allu Arjun Trivikram Movie, Interesting Title For Allu Arjun Trivikram Project, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Interesting Point In Allu Arjun Trivikram Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల‌ త‌రువాత మ‌రోసారి జ‌ట్టుక‌ట్టిన సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతమందిస్తున్నాడు. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా… ఏప్రిల్ 24 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌ముంది. అదేమిటంటే… నిన్న‌టి త‌రం క‌థానాయ‌కులు, ఈ త‌రం క‌థానాయ‌కులు… ఇలా మొత్తంగా అర‌డ‌జ‌ను మంది హీరోలు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. సీనియ‌ర్ హీరోలు రాజేంద్రప్రసాద్, సత్యరాజ్‌తో పాటు కొన్ని సినిమాల్లో హీరోగా న‌టించిన‌ బ్రహ్మాజీ, నవదీప్, సునీల్ కూడా ఇందులో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. అలాగే… యువ కథానాయకుడు సుశాంత్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మొత్త‌మ్మీద‌… బ‌న్నీ చిత్రంలో పాత‌, కొత్త త‌రానికి చెందిన ఆరుగురు హీరోలు న‌టించ‌నుండ‌డం విశేష‌మ‌నే చెప్పాలి.

[subscribe]


[youtube_video videoid=Qet0IxVPoe8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.