పటాస్ సినిమా తరువాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు చాలా రోజుల తరువాత ‘118’ సినిమాతో మంచి సక్సెస్ దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత వేణు మల్లిడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి కూడా విదితమే. ఎన్నో కథలు విన్న కళ్యాణ్ రామ్ కు వేణు చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అంతేకాదు ఈ సినిమాకు ‘తుగ్లక్’ అనే పేరు పెట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి. మరి ఇదే టైటిల్ ఉంచుతారో? టైటిల్ మార్చుతారో? తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తాజా అప్ డేట్ ఏంటంటే… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్ టి ఆర్ ఆర్ట్స్ నిర్మించనున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ద్విపాత్రిభినయం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మిగిలిన నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదు. త్వరలోనే ఆ వివరాలు తెలియజేయనున్నారు.
[subscribe]
[youtube_video videoid=5WbPq3qjJHE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: