ప్రజాదరణ పొందిన పాత సినిమాల టైటిల్స్‌తో కొత్త చిత్రాలు రావడం తెలుగు పరిశ్రమలో కొత్తేమీ కాదు. అనాదిగా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అయితే.. ఒకే కథానాయకుడికి సంబంధించిన పాత సినిమాల టైటిల్స్‌తో అరడజను కొత్త చిత్రాలు ఒకే ఏడాదిలో రావడం మాత్రం అరుదే. ఆ హీరో మెగాస్టార్ చిరంజీవి కాగా… ఆ చిత్రాలు ప్రాణం ఖరీదు, గ్యాంగ్ లీడర్, రాక్షసుడు, హీరో, జ్వాల, ఖైదీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటిలో ప్రాణం ఖరీదు పేరుతో రూపొందిన సినిమా ఇటీవలే తెరపైకి రాగా… రాక్షసుడు (బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో) ఈద్ కానుకగా జూన్‌లో రిలీజ్ కానుంది. ఇక నాని హీరోగా నటిస్తున్న గ్యాంగ్ లీడర్ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుండగా… తమిళ అనువాద చిత్రాలు జ్వాల (విజయ్ ఆంటొని కథానాయకుడు), ఖైదీ (కార్తి హీరో) కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక విజయ్ దేవరకొండ మల్టీలింగ్వల్ మూవీ హీరో కూడా చిరు టైటిల్‌తోనే రూపొందుతుండడం విశేషం. గతంలోనూ చిరు టైటిల్స్‌తో వచ్చిన చిత్రాల్లో శ్రీరస్తు శుభమస్తు వంటి సినిమాలు విజయం సాధించిన నేపథ్యంలో… రానున్న చిత్రాలు కూడా అదే బాటలో వెళతాయేమో చూడాలి.
[subscribe]
[youtube_video videoid=kk7nU6QHuWw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























