`వెంకీమామ` షూటింగ్ అప్‌డేట్స్‌

Venky Mama Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venky Mama Movie Shoot,Venky Mama Movie Shooting News,Venky Mama Telugu Movie Shooting Updates,Venkatesh and Naga Chaitanya New Movie Shooting,Venky Mama New Shooting Schedule Plans
Venky Mama Movie Latest Update

వెంకీమామ‌… విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న క్రేజీ మల్టీస్టారర్. ఇందులో రైస్ మిల్లు ఓన‌ర్ పాత్రలో వెంకీ న‌టిస్తుండ‌గా… ఆర్మీ ఆఫీసర్‌గా చైతూ కనిపించనున్నాడ‌ని స‌మాచారం. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతూకి జంట‌గా రాశీ ఖన్నా నటిస్తున్నారు. డి. సురేష్ బాబు, టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌… ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న సెకండ్‌ షెడ్యూల్‌లో… ముఖ్య తారాగణంపై స‌ర‌దాగా సాగిపోయే కుటుంబ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ పూర్తి కాగానే నెక్ట్స్ షెడ్యూల్‌ను కూడా భాగ్య‌న‌గ‌రంలోనే ప్లాన్ చేస్తోందట చిత్ర బృందం. 15 రోజులపాటు సాగే ఆ షెడ్యూల్‌లో కొన్ని సన్నివేశాలతో పాటు మ‌రో పాటను కూడా చిత్రీక‌రించేందుకు ప్రయత్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. రియల్ లైఫ్‌లో మేన‌మామ మేన‌ల్లుళ్ళు అయిన‌ వెంకీ, చైతూ… రీల్ లైఫ్‌లోనూ అవే పాత్ర‌ల్లో ఏ రేంజ్‌లో ఎంట‌ర్‌టైన్ చేస్తారో తెలియాలంటే మ‌రికొన్నాళ్ళు ఆగాల్సిందే.

[subscribe]


[youtube_video videoid=bJAKvOx_UE4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.