‘పిల్లా నువ్వులేని జీవితం’తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమయ్యాడు మెగా హీరో సాయి తేజ్. అనంతరం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ సినిమాలతో మెగాభిమానులను అలరించి… అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే… ఆ తర్వాత వచ్చిన ‘తిక్క’, ‘విన్నర్’, ‘నక్షత్రం’, ‘జవాన్’, ‘ఇంటిలిజెంట్’, ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమాలు ఆశించిన విజయాలను అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో… వేసవి సందర్భంగా (ఏప్రిల్ 12) విడుదలైన తాజా చిత్రం ‘చిత్రలహరి’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసాడు ఈ మెగాహీరో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే… ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఉంది. అదేమిటంటే… తేజు ప్రీవియస్ హిట్ మూవీ ‘సుప్రీమ్’ కూడా వేసవి కానుకగా (2016 మే 5న)విడుదల అయిన సినిమా కావడం విశేషం. మొత్తానికి… మూడేళ్ళ తరువాత మరోసారి సమ్మర్ సీజన్ తేజుకి బాగానే వర్కవుట్ అయిందనే చెప్పాలి. మున్ముందు కూడా ఈ మెగా హీరోకి సీజన్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో చూద్దాం…
[subscribe]
[youtube_video videoid=QvSP5gJkKg0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























