మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కొత్తగా నిర్మాత అవతారం కూడా ఎత్తిన సంగతి తెలిసిందే. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ అనే పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి.. తన ప్రొడక్షన్ హౌస్ లో మొదటగా.. పెళ్లి చూపులు సినిమాతో తనకు బ్రేక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ తో సినిమా చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో అప్ డేట్ ఏంటంటే…ఈ సినిమాలోనే మరో కీలకమైన పాత్రలో తమిళ టీవీ నటి వాణి భోజన్ కనిపించనుందనేది తాజా సమాచారం. టీవీ సీరియల్ లో నటిస్తున్న వాణికి అక్కడ మంచి క్రేజ్ ఉందట. ఇక ఈ సినిమా ద్వారా ఈ భామ తెలుగు తెరకు పరిచయమవుతుంది.
కాగా ఈ సినిమాతో షమ్మీర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మరి హీరోగా సక్సెస్ అయిన విజయ్ దేవరకొండ.. నిర్మాతగా ఎంత వరకూ సక్సెస్ అవుతాడో చూద్దాం..
[subscribe]
[youtube_video videoid=ND19JZGCaQg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: