పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రత్యేకం గా నిలిచిన చిత్రం ‘ఖుషి’. సంచలన విజయం సాధించిన ఈ సినిమాకి ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత పలు చిత్రాలను డైరెక్ట్ చేసిన సూర్య… మరోవైపు నటుడిగానూ తనదైన ముద్ర వేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ‘స్పైడర్’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో అలరించాడు సూర్య. అలాగే విజయ్ హీరోగా వచ్చిన తమిళ అనువాద చిత్రం ‘అదిరింది’ లోను విలన్ గా మెప్పించాడు.
ఇదిలా ఉంటే… మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ ఎస్.జె.సూర్య ప్రతినాయకుడు పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే… సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 10న సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో రజినీకి జోడిగా నయనతార నటించనుండగా… కథను కీలక మలుపు తిప్పే కూతురి పాత్రలో నివేదా థామస్ నటించనుంది.
అలాగే… పవర్ ఫుల్ విలన్ పాత్రలో ఎస్.జె.సూర్య నటించే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. త్వరలోనే సూర్య ఎంట్రీ పై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=h2K6y-aVFD8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























