యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక వైపు సాయిశ్రీనివాస్ తాజా చిత్రం `సీత` ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతుండగా… మరో వైపు తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ `రాక్షసన్` రీమేక్‌కు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. `రైడ్` ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటిస్తోందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… చిత్ర కథానుసారం ఈ సినిమాకి `రాక్షసుడు` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందని టాలీవుడ్ టాక్. గతంలో ఇదే టైటిల్‌తో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. 1986లో వచ్చిన నాటి `రాక్షసుడు` మ్యూజికల్ హిట్ అయ్యింది. ఇక ఇదే టైటిల్‌తో నాలుగేళ్ళ క్రితం సూర్య హీరోగా ఓ తమిళ డబ్బింగ్ మూవీ కూడా వచ్చింది. మరి… ఈ టైటిల్‌తోనే సాయిశ్రీనివాస్ వస్తాడా? లేదంటే మరో టైటిల్ అవుతుందా? అన్న విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=1eQHokIL9wA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: