పవన్ కళ్యాణ్ మీద విమర్శలపై కోన వెంకట్ వివరణ

kona venkat Responds to Controversial Comments on pawan kalyan,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,kona venkat Comments on Pawan Kalyan,kona venkat About Power Star Pawan Kalyan,Pawan Kalyan Response To Kona Venkat Comments
kona venkat Responds to Controversial Comments on pawan kalyan

ఏపీ లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక నుండి ఓ లెక్క అన్నట్టు.. ఇప్పటి వరకూ టీడీపీ, వైసీపీ పార్టీల మధ్యనే ఎన్నికల పోరు ఉండేది. కానీ ఇప్పుడు జనసేన మూడో శక్తిగా తెరపైకి వచ్చింది. జనసేన పార్టీ పెట్టి ఎంతో కాలం అవ్వట్లేదు కదా.. మాకు అంత పోటీ ఉండదులే అని మొదట టీడీపీ, వైసీపీ పార్టీలు అనుకున్నా… ఇప్పుడు అదే జనసేన పార్టీ చాపకింద నీరులా ప్రజల్లోకి వెళ్లి… ఏకు మేకులా తయారైంది. ఎంత జనసేన పార్టీ మాకు పోటీ కాదు పోటీ కాదు అని ఈ రెండు పార్టీలు అనుకుంటున్నా… రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోటీ ఇస్తుందన్న విషయం కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఈ మధ్య పలువురు ఇండస్ట్రీ పెద్దలు పవన్ పై పలు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా పోసాని, ఆ తరువాత రైటర్ చిన్నికృష్ణ, తరువాత కోన వెంకట్ ఇలా పలువురు పవన్ పై విమర్శలు గుప్పించారు. అయితే ఒకప్పుడు పవన్ ను ఆకాశానికెత్తేసిన వీళ్లు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఇలా విమర్శలు గుప్పించడానికి గల కారణం వైసీపీ పార్టీనే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోసానీ అంటే వైసీపీ పార్టీ అభ్యర్థి కాబట్టి.. పవన్ ప్రత్యర్థి కాబట్టి విమర్శిస్తారు.. అసలు కోన వెంకట్ కు ఏమైంది అన్న సందేహాలు వెల్లడవుతున్నాయి.

నిజానికి పవన్ కళ్యాణ్ కు కోన వెంకట్ కు ఉన్న సన్నిహిత సంబంధం గురించి అందరికీ తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గురించి ఎదో ఒకటి చెప్తూనే ఉంటారు. వారిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం గురించి గొప్పగా చెప్పుకొనే వారు. ఇంకా చెప్పుకోవాలి అంటే సమయం సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ ని నిత్యం పొగుడుతూనే ఉండేవారు. అంతలా పొగిడిన కోన పవన్ కళ్యాణ్ రాజకీయ విషయాల్లో మాత్రం ఎందుకు యూటర్న్ తీసుకున్నారు.. పవన్ మీద ఎందుకు తీవ్ర విమర్శలు గుప్పించారు అని సందేహపడుతున్నారు. అయితే దానికి కారణం కోన వెంకట్ కుటుంబసభ్యులు కూడా రాజకీయాల్లో ఉండటమే.. అది కూడా వైసీపీ తరుపునే వారు కూడా పోటీ చేస్తున్నారు. అందుకే కోన ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని అంటున్నారు.

ఇటీవల తెలంగాణను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టిన కోన.. ఇరు రాష్ట్రాల ప్రజల్లో విద్వేషం రగిల్చే ప్రయత్నం పవన్ చేస్తున్నాడని విమర్శించాడు. సినీ రంగంలో పవన్ కళ్యాణ్ నాకు అత్యంత సన్నిహితుడు అన్ని విషయాలను షేర్ చేసుకొనే వాళ్ళం, కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలను మొట్టమొదట స్పందించిన వ్యక్తీని కూడా నేనే. కాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అతని వ్యక్తిత్వం నాకు అంతగా నచ్చడం లేదన్నారు. అంతే కోన వెంకట్ అన్ని మాటలు అన్న తరువాత జనసైనికులు ఊరుకుంటారా.. కోన వెంకట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కావాలనే పవన్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని… ఇంకా ఇలాంటి వాళ్లు చాలా మంది వస్తారని.. జనసేన పార్టీ వాళ్లు జాగ్రత్తగా ముఖ్యంగా పవన్ జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. మరి ఇంత రచ్చ జరిగిన తరువాత ఇప్పుడు కోన వెంకట్ స్పందించి.. పవన్ కళ్యాణ్ పై తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరణ ఏంటో మీరు కూడా చూడండి…

[subscribe]

[youtube_video videoid=dyW3Q02vQwc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.