గోల్కొండ హై స్కూల్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. శుఖలేఖలు సినిమాతో హీరోగా మారిన శ్రీనివాస్ సాయి లేటెస్ట్ గా నటించిన సినిమా వినరా సోదర వీర కుమారా. సతీష్ చంద్ర నాదేళ్ల దర్శకత్వంలో.. లక్ష్మణ్ సినీ విజన్స్ క్యాదారి నిర్మాణంలో తెరకెక్కిన ఈసినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి టీజర్, ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు: శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్, ఝాన్సీ, జెమిని సురేష్
దర్శకత్వం: సతీష్ చంద్ర నాదెళ్ల
నిర్మాత: లక్ష్మణ్ క్యాదారి
మాటలు, పాటలు: లక్ష్మీభూపాల
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఎడిటింగ్: మార్తండ్. కె. వెంకటేష్
కథ:
ఉత్తేజ్, ఝాన్సీల తనయుడు రమణ (సాయి శ్రీనివాస్). సరిగ్గా చదువు అబ్బని రమణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఆ క్రమంలో అదే ఆటోలో రోజూ కాలేజ్ కి వెళ్లే సులోచన (ప్రియాంక జైన్) ప్రేమలో పడతాడు. ఆ విషయం ఆమెకు చెప్పినా.. తన బావ (సందేశ్)తో పెళ్లి చేయాలనే కుటుంబ నిర్ణయం కారణంగా రమణ ప్రేమను ఆమె అంగీకరించదు. ఆ సమయంలోరమణ గురించి తెలుసుకున్న ఆమె బావ రమణను మనుషులు పెట్టి కొట్టిస్తాడు. అయినా కూడా రమణ ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో సులోచన కూడా రమణను ఇష్టపడుతుంది.
ఇదిలా ఉండగా.. ఒకానొక సందర్భంలో రమణ తన ఇంటి గోడలో ఆత్మ ఉందని తెలుసుకుంటాడు. సూరీ అనే వ్యక్తి ఆత్మ ఆ గోడలో ఉందని తెలుసుకొని అతనితో మాట్లాడుతుంటాడు. తలుపు శబ్దంతో వచ్చే సిగ్నల్‌ను సూరి అనే వ్యక్తిగా భావించి తనతో అన్ని విషయాలు పంచుకుంటాడు రమణ. ఆ క్రమంలో తనలాగే ప్రేమలో విఫలమై సూరీ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుంటాడు. అయితే సూరీకి చివరి కోరిక ఉంటుంది. దానికి రమణను సహాయం కోరతాడు. తన స్నేహితుడు అప్పగించిన బాధ్యతలను, కోరికలను తీర్చడానికి రమణ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ఈ కథలో కీలకమైన సూరీ ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడు? రమణను సూరి ఎలాంటి సహాయాన్ని కోరాడు? చివరకి సులోచన ప్రేమను గెలుచుకొన్నాడా? సులోచన ప్రేమను గెలుచుకోవడానికి ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నాడు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
డైరెక్టర్ సతీష్ నేటి జనరేషన్ ఆలోచనా విధానం ఎలా ఉంది… ప్రేమ విషయంలో యూత్ ఎలా ఆలోచిస్తుంది అనే కోణంలో సినిమా తీసి మంచి సందేశం అందిచారని చెప్పొచ్చు. ప్రేమ కోసం చావడం, చంపడం అవసరమా? ప్రేమంటే ఇదేనా? ప్రేమకోసం ఇన్ని జీవితాలు నాశనం అవ్వడం కరెక్టేనా? అన్న విషయాలను ఓ డిఫరెంట్ ప్రేమకథతో చూపించి ఓ గొప్ప సందేశం అందించారు నేటి యువతకు. తల్లిదండ్రుల త్యాగాలను మరిచి ప్రేమ కోసం యువతీ యువకులు జీవితాన్ని అర్థాంతరంగా ముగించడం సరికాదు అనే పాయింట్ ను చాలా చక్కగా చూపించాడు. నేటివిటీని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. అక్కడ వాతావరణం, మనుషుల ప్రవర్తన పూసగుచ్చినట్లు ఆవిష్కరించాడు. అంతేకాదు ఫ్రెండ్ అంటే ఎలా వుండాలనేది కూడా సూరిపాత్ర ద్వారా చెబుతూనే.. ఎలా వుండకూడదో అనేది కూడా చెప్పే ప్రయత్నం చేశాడు.
ఇక ఈసినిమాకు ప్రధాన బలం హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీనివాస్ సాయి రమణ పాత్రలో ఒదిగిపోయాడు. రకరకాల వేరియేషన్స్ చూపించి ఆకట్టుకొన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ కూడా పల్లెటూరి పిల్లలా.. అమాయకమైమ పాత్రలో చాలా చక్కగా నటించింది. కీలకమైన సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కూాడా యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఉత్తేజ్, ఝాన్సీ పేదరికంతో బాధపడే తల్లిదండ్రుల పాత్రల్లో ఆకట్టుకొన్నారు.
రచయిత లక్ష్మీభూపాల గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆయన రాసిన మాటలు, పాటలు సినిమాకు బలంగా మారాయి. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం బాగుంది. కెమెరా పనితనం బావుంది. పల్లెటూరి అందాలను చాలా అందంగా చూపించాడు.
ఇక ఫైనల్ గా చెప్పాలంటే.. ఈసినిమా కేవలం యూత్ కి మాత్రమే కాదు అందరూ చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు.
వినరా సోదర వీర కుమారా తెలుగు మూవీ రివ్యూ
User Review
( votes)[youtube_video videoid=xwVycrSfAio]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: