ధనుష్,అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా ‘ఓం’ .ఈ భారీ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మార్కెట్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. అందుకు ప్రధాన కారణం యువ సంగీత సంచలనం సాయి అభ్యంగ్ అందించిన మ్యూజిక్. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ సాంగ్స్ (అలాకా లూవా, వీర వీర) సోషల్ మీడియా మరియు ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో చార్ట్‌బస్టర్‌లుగా నిలిచి, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్నాయి. ఈ పాటలు సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా ఆకాశాన్నంటేలా చేశాయి.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా వంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, వండర్‌బార్ ఫిల్మ్స్ మరియు ఆర్ టేక్ స్టూడియోస్ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో థియేటర్లను కేటాయిస్తూ, డెఫినిట్‌గా బిగ్ ఓపెనింగ్స్ సాధించేలా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























