ఆకట్టుకున్న ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్ 

ene repeat trailer grabs attention

యూత్‌ఫుల్ చిత్రాలకు ట్రెండ్ సెట్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఈఎన్ఈ రిపీట్’. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ, స్నేహితుల మధ్య ఉండే బాండింగ్, గొడవలు మరియు సరదా సన్నివేశాలతో సాగింది. గ్యాంగ్‌లో శ్రీనాథ్ మాగంటి కొత్తగా చేరి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, పాత మిత్రుల మధ్య సాగే హిలేరియస్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. సృజన్ యరబోలు ,సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

విడుదలైన ట్రైలర్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.