సీన్‌లో నా క్యారెక్టర్ చాలా యూనిక్‌గా ఉంటుంది –  నజ్రియా నజీమ్

Nazriya Nazim Says Her Role in Scene Is Unique

హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా,  నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది. ‘సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ నజ్రియా నజీమ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత మరోసారి మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, ఆదరణ, అభిమానానికి ధన్యవాదాలు. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చేశాను. ఈ సందర్భంగా మాస్టర్స్‌కు థాంక్స్ చెబుతున్నాను. వాళ్లు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాకు మాయ లాంటి క్యారెక్టర్ ఇచ్చిన జిత్తు మాధవన్‌కు థాంక్యూ.  క్యారెక్టర్ చాలా యూనిక్‌గా ఉంటుంది. అలాగే మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సూర్య గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నవంబర్ 6న అందరూ థియేటర్లలో ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.