ఇట్లు అర్జున కొత్త రిలీజ్ డేట్ ఇదే

Itllu Arjuna New Release Date Revealed

కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, మలయాళ నటి అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు.మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఇట్లు అర్జున’ సినిమాను నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకర్షణీయమైన విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటోంది. ఒక భారీ క్యాలెండర్‌పై హీరో అనీష్, హీరోయిన్ అనస్వర రాజన్ పక్కపక్కనే కూర్చున్నట్లు పోస్టర్‌ను రూపొందించారు. పింక్ అవుట్‌ఫిట్‌లో ఆమె అందంగా కనిపిస్తుండగా, అనీష్ క్యాజువల్, స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.

ఈ సినిమా అర్జున్ అనే మూగ యువకుడి చుట్టూ తిరిగే ఓ విభిన్నమైన ప్రేమకథ. అర్జున్ తన జీవితమంతా కీర్తిని మౌనంగా ప్రేమిస్తుంటాడు. అతని ప్రయాణం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. ప్రేమ, హాస్యం, సాహసం, ఊహించని ట్విస్టులతో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, వినోదం కలగలిసిన ఆసక్తికరమైన ప్రేమకథగా అలరించనుంది.

కింగ్ నాగార్జున ఇప్పటికే ఈ సినిమాను వీక్షించి, ఇందులోని కొత్త కాన్సెప్ట్‌, విభిన్నమైన కథనాన్ని అభినందించారు. ఆయన ప్రోత్సాహం, మద్దతు ఈ యువ చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్నిచ్చాయి.

సాంకేతికంగా ఈ సినిమాతో రాజా మహదేవన్ సినిమాటోగ్రాఫర్‌గా పరిచయం అవుతున్నారు. తమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పాటలతో ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌పై ఆసక్తి పెరిగింది. అనిరుధ్ రవిచందర్ ఆలపించిన ‘హాయ్ రే’, మోహిత్ చౌహాన్ పాడిన ‘చిన్ని చిన్ని’, విశాల్ మిశ్రా ఆలపించిన ‘ఎల్లో చున్నీ’ పాటలు ప్రేక్షకులకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

విభిన్నమైన ప్రేమకథ, కొత్త హీరోహీరోయిన్ల జంట, ఆసక్తికరమైన ప్రమోషన్లతో ‘ఇట్లు అర్జున’ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. నవంబర్ 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.