విక్టరీ వెంకటేశ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కతున్న భారీ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ .వెంకీ-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ సెకండ్ సింగిల్ ‘మాలా వచ్చా చూడు’ పాటను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు’ అంటూ సాగే ఈ మాస్ రొమాంటిక్ పాటను వెంకటేశ్ మరియు నివేదా పేతురాజ్ జంటపై కలర్ఫుల్గా చిత్రీకరించారు. ప్రముఖ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి అందించిన ఊరమాస్ లిరిక్స్, తమన్ అందించిన బిజీ బీట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ధనుంజయ్ సీపాన, రణినారెడ్డిల ఎనర్జిటిక్ గాత్రం పాటలోని మాస్ వైబ్‌ను మరింత ఎలివేట్ చేయగా, భాను మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులకు వెంకటేశ్ తనదైన గ్రేస్ అండ్ టైమింగ్‌తో అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ ఇచ్చారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్, రావు రమేష్, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. మొదటి పాటతోనే మంచి స్పందన తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ మరియు థియేట్రికల్ రిలీజ్ తేదీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వెలువడనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























