మెగా హీరో సాయిదుర్గా తేజ్ (సాయిధరమ్ తేజ్) తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందించారు. ఆయన కెరీర్లో 19వ చిత్రంగా (#SDT19) తెరకెక్కనున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి ‘సేవ్ ది టైగర్స్’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు తేజ కనుమ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. కుటుంబ సంబంధాలు, హస్యంతో కూడిన వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తేజ కనుమకు మంచి గుర్తింపు ఉండటంతో, ఈ కాంబినేషన్‌పై ఇటు ఇండస్ట్రీలోనూ, అటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండగా, ఆ చిత్రం పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ కొత్త సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలోనే వెల్లడించనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























