హతాః థియేట్రికల్ హక్కులు దిల్ రాజు చేతికి

Dil Raju Bags Theatrical Rights of Hatah

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రెజెంటర్‌గా, ఆయన సొంత బ్యానర్ ‘కెఎ ప్రొడక్షన్స్’ సమర్పణలో వస్తున్న వినూత్నమైన మైండ్ బెండింగ్ మిస్టరీ థ్రిల్లర్ ‘హతాః’ . పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనుష్ గోరక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిర్మాణ, పంపిణీ సంస్థ దిల్ రాజు ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రానికి సంబంధించిన నైజాం మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంది.

దిల్ రాజు నైజాం, యూఏ వంటి కీలకమైన రీజియన్స్‌లో డిస్ట్రిబ్యూషన్‌ను తన చేతుల్లోకి తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఎల్లప్పుడూ ఆదరించే దిల్ రాజు ‘హతాః’ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టడం సినిమాపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.

SVC ప్రొడక్షన్ అండ్ రిలీజ్ హ్యాండ్ పడటంతో నైజాం, ఉత్తరాంధ్రలోని ప్రధాన థియేటర్లలో ఈ చిత్రానికి భారీ స్థాయిలో స్క్రీన్లు కేటాయించనున్నారు.

కథా నేపథ్యం: సీనియర్ నటుడు రెహమాన్, తనుజా పుట్టస్వామి, కుష్లు, నమ్రిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, సైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్‌తో సాగనుంది.

నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.