బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టిస్తోంది యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘తెల్లకాగితం’. ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్, నూతన నటి బొగాపతి నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రం మొదటి రోజు ఆట నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1.58 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్, శరణ్య ప్రదీప్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, దీపక్ మాలి, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, విజరు బుల్గానిన్ స్వరపరిచిన సంగీతం చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.
మంచి కంటెంట్ మరియు నటీనటుల సహజ సిద్ధమైన నటనతో రూపొందిన ఈ చిత్రానికి యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఏకగ్రీవంగా బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ లభిస్తోంది. మౌత్ టాక్ తో థియేటర్ల వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుండగా వీకెండ్‌లో వసూళ్లు మరిన్ని పెరిగే అవకాశం ఉందని మేకర్స్ హర్షం వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























