నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కిన మాస్ అండ్ రా యాక్షన్ ఎపిక్ ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్లలో సునామీ సృష్టిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలోనే ‘ది ప్యారడైజ్’ మొదటి 4 రోజుల (ఫస్ట్ వీకెండ్) బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డును అధికారికంగా మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 155 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా రికార్డు నమోదు చేసింది.
నైజాం, సీడెడ్ సహా ఆంధ్రాలోని అన్ని ప్రధాన సెంటర్లలో ప్రతి రోజు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఓవర్సీస్, ముఖ్యంగా యుఎస్ఏ మార్కెట్లో ‘జడల్’ క్రేజ్ అసాధారణ స్థాయిలో ఉంది.ఈసినిమా అక్కడ 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో హోల్డ్ సాధిస్తూ ఈ చిత్రం లాంగ్ రన్లో మరిన్ని బెంచ్ మార్క్‌లను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























