నటీనటులు: కార్తి, ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ తదితరులు
దర్శకత్వం: పి.ఎస్. మిత్రన్
సంగీతం: సామ్ సి.ఎస్.
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి
నిర్మాణ సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన ‘సర్దార్ 2’ ఒకటి. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో గతంలో వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన ‘సర్దార్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపుదిద్దుకోవడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అంచనాలు ఆదుకుందో లేదో రివ్యూలో చూద్దాం.
కథ:
ఈసారి కథ అంతా భారతదేశ భద్రతకు తీవ్ర ముప్పుగా మారిన ప్రమాదకరమైన ‘ఆపరేషన్ డోకు’ అనే రహస్య మిషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ ప్లాన్‌ను భారత్ తొలుత అడ్డుకోగలిగినప్పటికీ, అత్యంత క్రూరుడైన బ్లాక్ డాగర్ (ఎస్.జే. సూర్య) రంగంలోకి దిగి ఆ ఆపరేషన్‌ను తిరిగి రీ-యాక్టివ్ చేస్తాడు. దాంతో దేశానికి ముప్పు మరింత తీవ్రరూపం దాల్చుతుంది.
ఈ వినాశకరమైన కుట్రను ఛేదించడానికి భారత రా (RAW) ఏజెంట్లు అయిన సర్దార్ (కార్తి) మరియు అతడి కొడుకు విజయ్ ప్రకాష్ (కార్తి) ఇతర సీక్రెట్ ఏజెంట్లతో కలిసి రెస్క్యూ మిషన్ ప్రారంభిస్తారు. అసలు ఈ ‘ఆపరేషన్ డోకు’ వెనుక ఉన్న అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అది భారత్‌ను ఏ స్థాయిలో దెబ్బతీయబోతోంది? ఈ క్రమంలో తండ్రీకొడుకులు సర్దార్, విజయ్‌లు తమ ప్రాణాలను పణంగా పెట్టి చేసిన సాహసాలు ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా ప్రారంభంలోనే మెడికల్ మాఫియా కాన్సెప్ట్‌లోకి తీసుకెళ్లినప్పటికీ, మొదటి భాగంతో పోలిస్తే సీన్లు అంత బిగువుగా లేవు. స్పై ఎలిమెంట్స్ రొటీన్‌గా అనిపిస్తాయి. కార్తి గెటప్‌లు, భారీగా డిజైన్ చేసిన ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకున్నప్పటికీ కథనం అక్కడక్కడా నిమ్మదించింది.
సెకండాఫ్‌లో హీరో-విలన్ మైండ్ గేమ్‌లతో కథను నడిపించే ప్రయత్నం చేశారు. అయితే రన్ టైమ్ సుమారు మూడు గంటలు ఉండటం, అనేక సన్నివేశాలు ముందే ఊహించేలా సాగడం సినిమా గ్రాఫ్‌ను తగ్గించేశాయి. మొదటి భాగంలో ఉన్నంత బలమైన ఎమోషన్స్ ఇందులో పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అయితే ప్రీ క్లైమ్యాక్స్ , క్లైమ్యాక్స్ ఓకే అనిపిస్తాయి. ఓవరాల్ గా సర్దార్ 2 ఫస్ట్ పార్ట్ లాగా సూపర్ అనలేం కానీ పర్వాలేదని చెప్పొచ్చు.
నటీనటుల ప్రతిభ:
కార్తి మరోసారి తన నటన, విభిన్నమైన గెటప్పులతో సినిమాను ముందుండి నడిపించారు. యాక్షన్ సీన్స్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్‌లో ఆయన చూపించిన వేరియేషన్లు ఆకట్టుకుంటాయి. ప్రతినాయకుడిగా ఎస్.జే. సూర్య తన మార్క్ విలనిజంతో మెప్పించారు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకోగా, మిగిలిన నటీనటులు కథకి తగిన మద్దతు అందించారు.
సాంకేతిక వర్గం:
సామ్ సి.ఎస్. అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ అత్యున్నత ప్రమాణాలతో, గ్రాండ్‌గా ఉంది. రూబెన్ ఎడిటింగ్ సెకండాఫ్‌లోని కొన్ని సాగదీత సీన్లను మరికాస్త కుదించి ఉంటే కథనానికి మరింత స్పీడ్ వచ్చేది. నిర్మాణ విలువలు విజువల్స్ పరంగా సినిమాని చాలా రిచ్‌గా నిలబెట్టాయి.
తీర్పు :
మెడికల్ మాఫియా నేపథ్యానికి స్పై ఎలిమెంట్స్ జోడించి తీసిన ఈ చిత్రం పర్వాలేదనిపిస్తుంది. నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, కార్తి పెర్ఫార్మెన్స్, గ్రాండ్ మేకింగ్ మరియు సమాజానికి అవసరమైన మెసేజ్ వల్ల ‘సర్దార్ 2’ ను స్పై థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఓసారి ట్రై చేయొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























