అక్కినేని నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ విడుదల తేదీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ప్రచారంలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం షూటింగ్ దాదాపు 90 శాతానికి పైగా పూర్తయినప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం ఎక్కువగా పడుతుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపలకు తెరపడనుంది. మేకర్స్ కూడా ఈమేరకు రిలీజ్ డేట్ లాక్ అని కూడా ట్వీట్ చేశారు.డిసెంబర్ 3న ఈసినిమా రిలీజ్ కానుందని సమాచారం.అతి త్వరలో ఈ రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.
శ్రీ వెంకటేశ్వర చలనచిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్గా నటిస్తుండగా, బి. అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. చైతూకి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మేకర్స్ అవుట్పుట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేస్తున్నారు. ఈసినిమాపై అక్కినేని ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























