మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ప్రదర్శన ప్రారంభించిన నాటి నుంచి విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹270 ప్లస్ కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం రూ. 25 కోట్ల పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. కేరళలో సునామీ సృష్టిస్తున్న ఈ సినిమాకు, తెలుగు వర్షన్ లోనూ అద్భుతమైన స్పందన లభిస్తోంది. పాజిటివ్ టాక్, ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతుతో మూడో వారంలో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
కుటుంబ నేపధ్యంలో నడిచే చక్కటి కథాంశం, నివిన్ పౌలీ టైమింగ్, మమితా బైజూ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న స్పీడ్ చూస్తుంటే, మాలీవుడ్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ రికార్డును సొంతం చేసుకున్న ‘లోకః’ ( ₹302+ కోట్లు) రికార్డులను కూడా ఈ సినిమా త్వరలోనే తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక రీసెంట్ గా ఈసినిమా తెలుగులో కూడా విడుదలై హిట్ అనిపించుకుంది. లిమిటెడ్ థియేట్రికల్ రిలీజైనా మౌత్ టాక్ బాగుండడంతో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























