ఇరుముడి బాక్సాఫీస్ రాంపేజ్ కంటిన్యూ

Irumudi Box Office Rampage Shows No Signs of Slowing Down

మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన నాటి నుంచి థియేటర్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న ఈ చిత్రం రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. సాధారణంగా రెండు వారాల తర్వాత ఏ సినిమాకైనా క్రేజ్ తగ్గడం సహజం, కానీ ఈ చిత్రం మాత్రం మూడో వారాంతంలోనూ అంతకంతకూ తన హోరును పెంచుకుంటూ పోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముఖ్యంగా 15వ రోజు కూడా బుకింగ్స్‌లో ఈ సినిమా సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో కేవలం ఒక్క రోజే 1 లక్షకు పైగా టికెట్లు అమ్ముడవ్వడం విశేషం. ఈ స్థాయి బుకింగ్స్ చూస్తుంటే థియేటర్లలో ఇంకా జాతర కొనసాగుతోందని స్పష్టమవుతోంది. ఈరోజు , రేపు కూడా ఈ కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఈసినిమా ఈరోజుతో 250కోట్ల క్లబ్ లో చేరనుంది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలువడమే కాకుండా ఇరుముడి తనకు జనరేషనల్ కం బ్యాక్ ఇచ్చింది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.