మారెమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రానున్న రవితేజ

Ravi teja to attend maremma mass pre release event

మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిథిగా హాజరవుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటల నుంచి గ్రాండ్ గా జరగనుంది. రవితేజ రాకతో ఈ సినిమా ప్రమోషన్లకు భారీ మైలేజ్ లభించడమే కాకుండా ప్రేక్షకుల్లోనూ, మాస్ వర్గాల్లోనూ అంచనాలు మరింత పెరగనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంతో రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ భూపతిరాజు కథానాయకుడిగా పరిచయం అవుతుండగా, ఆయన సరసన దీపా బాలు కథానాయికగా నటించింది. వీరితో పాటు వికాస్ వాసిష్ట, సీనియర్ నటుడు వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి, వి.ఎస్. రూపా లక్ష్మి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహించారు. మంతెన భాస్కరరాజు సమర్పణలో ప్రమోద్ స్టూడియోస్ మరియు ఆద్యా ప్రొడక్షన్స్ బ్యానర్లపై పద్మావతి మంతెన ఈ చిత్రాన్ని ఎంతో నిర్మించారు.

మాస్ మహారాజా సపోర్ట్‌తో గ్రాండ్‌గా జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.