సంగీత్ శోభన్ – అనస్వర రాజన్ మూవీ టైటిల్ గ్లింప్స్ రానుంది

SANGEETH x ANASWARA Title Glimpse Set to Launch on September 6

యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో సంగీత్ శోభన్, హాట్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనస్వర రాజన్ కాంబినేషన్‌లో ఓ సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతుంది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ డైరక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైటిల్ గ్లింప్స్ ను సెప్టెంబర్ 6వ తేదీన లాంచ్ చేయడానికి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ధిరేష్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్స్ మరియు విజిబి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై ధీరేజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ భూపాల సంభాషణలు అందిస్తున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్ ‘మారుతి’ అనే మిడిల్ క్లాస్ యువకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌ లో సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్లింప్స్ ద్వారా సినిమా కథా నేపథ్యం, టైటిల్‌పై పూర్తి స్పష్టత రానుంది. యూత్‌ఫుల్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి బజ్ నెలకొంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.