మహేంద్రగిరి వారాహి మంచి డివోషనల్ థ్రిల్లర్ -హీరో సుమంత్

Mahendragiri Varahi Is a Unique Devotional Thriller Says Sumanth

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే కథతో రూపొందుతోంది. ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘వాట్ ఏ లాజిక్ సర్ జీ’ పాటను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీరు ఎంత సౌండ్ చేస్తున్నారో, సెప్టెంబర్ 11న మా ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాతో అంత సౌండ్ చేయాలని కోరుకుంటున్నాం. ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాలో కథ, నా పెర్ఫార్మెన్స్ చాలా ప్రత్యేకంగా, వేరే కోణంలో ఉంటాయి. ఇది ఒక డివోషనల్ థ్రిల్లర్. ‘కాంతారా’, ‘కార్తికేయ’, ‘విరూపాక్ష’ లాంటి సినిమాలు ఎంతో పెద్ద విజయాలు సాధించాయి. అలాంటి సినిమాల జాబితాలోకి ‘మహేంద్రగిరి వారాహి’ కూడా చేరుతుందని నమ్ముతున్నాను. ఆడియన్స్ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. సుమంత్ గారు ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఇందులో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సంతోష్ చాలా పేషెంట్‌గా ఈ సినిమా తీశాడు. మా నిర్మాతలు చాలా అద్భుతంగా ఈ సినిమాను నిర్మించారు. ఇలాంటి సినిమా చేయాలంటే చాలా గట్స్ కావాలి. సెప్టెంబర్ 11న తప్పకుండా అందరూ థియేటర్స్‌లో సినిమా చూడండి.

డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు మధు గారికి, లక్ష్మణ్ గారికి థాంక్యూ. సుమంత్ గారితో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

ప్రొడ్యూసర్ మధు మాట్లాడుతూ..ఇది మీ అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి వెళ్లండి. చాలా ఎంజాయ్ చేస్తారు.

వంశీ చాగంటి మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. మంచి డివోషనల్ సినిమా. సెప్టెంబర్ 11న ఈ సినిమా వస్తోంది. అందరూ మీ ఇంట్లో వాళ్లను కూడా తీసుకెళ్లి ఈ సినిమాని థియేటర్‌లో చూడండి. సక్సెస్ మీట్‌లో మళ్లీ మీతో కలవాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.