‘బేబీ’ చిత్రంతో ఘన విజయం సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హిట్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ డ్రామా ‘ఎపిక్’ : ఫస్ట్ సెమిస్టర్. ‘#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ ‘మనసా వాచా’ విడుదలై ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రసిద్ధ గాయని కె.ఎస్. చిత్ర మరియు చరణ్ శ్రీపతి కలసి ఆలపించిన ఈ మెలోడీ పాట మనసుకు ఎంతో హాయినిచ్చేలా ఉంది. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన స్వరాలు, శ్రీహర్ష ఈమని రాసిన అర్థవంతమైన సాహిత్యం పాట స్థాయిని మరింత పెంచాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మధ్య ఉన్న కెమిస్ట్రీని ప్రతిబింబించేలా ఈ విజువల్స్ ప్లాన్ చేశారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధురమైన పాటతో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా మరింత పెరిగాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























