యంగ్ హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భోగి’ విడుదలపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఆగస్టు 28న థియేటర్లలోకి తీసుకురావాలని భావించినప్పటికీ, ప్రస్తుతానికి రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత కీలకమైన భాగం కావడంతో, ఆ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకులకు అత్యుత్తమ క్వాలిటీతో విజువల్ ఎక్స్పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది. వీఎఫ్ఎక్స్ వర్క్ మరింత సమయం తీసుకుంటుండటంతో, నాణ్యత తగ్గకుండా పూర్తి చేసి త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని వెల్లడించారు.
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. శర్వానంద్‌ను సరికొత్త లుక్‌లో చూపెట్టబోతున్న ఈ సినిమా గ్రాండియర్ విషయంలో రాజీ పడకూడదనే మేకర్స్ నిర్ణయంపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన వెంటనే ‘భోగి’ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.భీమ్స్ సిసిరోలియో ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























